ఇది తెలుగు జాతి, ఇది తెలుగు భాష, ఇది తెలుగు వేదిక తెలుగు భాష కొక సహజ శక్తివుంది. అందుకనే కర్ణాటక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమునందు, తెలుగు భాషను రాజ భాష చేసెను కర్ణాటక ఆంధ్ర సార్వభౌముడనిపించుకొని “దేశ భాష లందు తెలుగు లెస్స ” అని చాటి చెప్పిన మహానియుడు.
తెలుగు విజ్ఞాన సమితి.ఇది1952వ సం||రంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం లో నాడు నివసించిన ,మహనీయులు కీ||శే|| తేన్నేటి విశ్వనాధం గారు ,దివాన్ న్యాపతి మాధవ్ రావు పంతులు గారు ,సూరిభగవంతం గారు , పి.సాంబయ్య గారు ,సి.అన్న రావు గారు మొదలైన ప్రముఖులు తెలుగు విజ్ఞాన సమితి స్థాపించారు.
ఈ యొక్క తెలుగు విజ్ఞాన సమితి తిరుమల విధ్యానికేతన్ అనే ఉన్నత పాఠశాలను,శ్రీ తెన్నేటి విశ్వనాధం స్మారక గ్రంథాలయాన్ని స్థాపించి నిర్వహిస్తోంది.సమితి ప్రతి సంవత్సరము స్వతంత్ర దినోత్సవము,గణతంత్ర దినోత్సవములతో పాటు కర్ణాటకాంద్ర అవతరణ ఉత్స్తవం ఆచరిస్తోంది. ఆ సందర్భంలో కర్ణాటకాంద్ర సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయల పేరు మీద ,నాటక రత్న శ్రీ గుబ్బి వీర అన్న గారి స్మారకంగా తెలుగు ,కన్నడ కళాకారులను సాహిత్య వేత్తలను సత్కరించి బహుమతీ ప్రదానం చేస్తోంది.సాహిత్య కళారంగాలలో ఆరితేరిన మహనీయులనెందరినో సమితి గత అరవై సంవత్సరాలలో సన్మానించి గౌరవిస్తుంది. బెంగుళూరు నగరంలో అనేక చోట్ల సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలు, సంభవించినప్పుడు, బెంగుళూరు నగరంలోని తెలుగువారి సహాయ సహకారాలతో, డబ్బు, దుస్తులు, మందులు వరదబాధితులకు అందచేయటం జరిగింది. ఈ విధంగా సమితి, బాషా, సాంస్కృతిక పరంగానే కాకుండా సంఘ సేవను కూడా తన కర్తవ్యంగా భావించి నిర్వహిస్తుంది.
కీర్తిశేషులు చెలికాని అన్నా రావు గారు, ఏ ఎస్ చిన్న స్వామి రాజు, కేఎల్ రమేష్, ఎస్. ఎం బాలక్రిష్ణ గారు తెలుగు విజ్ఞాన సమితి విద్య ట్రస్ట్ అధ్యక్షులుగా సేవలందించారు.
అలాగే ఈ యొక్క తెలుగు విజ్ఞాన సమితి విద్యా ట్రస్టులో ఎం. వరదరాజు అధ్యక్షులుగా, ఎన్. గణేష్ రాజు అధ్యక్షులుగా, ఎస్ భోజరాజు ప్రధాన కార్యదర్శిగా, ఎం దొరస్వామి రాజు కోశాధికారిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు.
అలాగే ఈ యొక్క తెలుగు విజ్ఞాన సమితిలో సివి శ్రీనివాసయ్య ( ఆతిథ్య సంఘం ), కే. గంగరాజు ( కార్యక్రమ నిర్వాహణ సంఘం) ,
సీ.ఏ. వరదరాజు ( రవాణా సౌకర్య సంఘం ) , టి వెంకట సుబ్బారావు ( ప్రత్యేక సంచిక సంచాలకులు) వీరందరూ తెలుగు విజ్ఞాన సమితి లోని వజ్ర మహోత్సవ సంఘాల అధ్యక్షులుగా ఉన్నారు.
తెలుగు భాష సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన తెలుగు విజ్ఞాన సమితి సేవలకు గుర్తింపుగా 2012 ఆగస్టు 4న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రధానం చేసింది. పురస్కారాలతో పాటు దేశంలోని పలు ముఖ్య నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు , ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత పురందేశ్వరి గారు , కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ గారు, మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు, బుద్ధ ప్రసాద్ గారు కూడా ఈ తెలుగు విజ్ఞాన సమితిని గుర్తించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా భారతదేశం మొత్తం ఈ యొక్క బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి యొక్క సేవలను గుర్తించి ఎంతోమంది నాయకులు, ప్రేమికులు , ప్రజలు ఆదరించి సేవలు సహాయాలు అందించారు.
ఇటీవల సంస్థ ఆధ్వర్యము లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవముగా జరిగాయి.
తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ ఇడమకంటి లక్ష్మీ రెడ్డి గారు ఎంతో కృషి తో , మరిన్ని కార్యక్రమాలు తో,,సంస్థ అభివృద్ధికి అధ్యక్షులు, ఇతర గౌరవ సభ్యుల సహకారముతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.