టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం మార్కో సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం విడుదల అయిన మార్కో సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే మోస్ట్ వైలెంట్ యాక్షన్ మూవీ గా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చాలా రివ్యూలు తేడాగా వచ్చాయి. అయితే ఈ సినిమాపై విమర్శలు కూడా అంతే బాగా వైరల్ అయ్యాయి. సినిమాలో ఇంత హింస అవసరమా… ఇలాంటి చెత్త సినిమాను ఎప్పుడూ చూడలేదు అంటూ చాలామంది అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఈ సినిమాలోని హింసను సాధారణ ఆడియన్స్ భరించడమే కష్టం. ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరోని అడగగా.. ఆయన చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారిపోయింది. సమాజంలో జరుగుతున్న హింస ని మేము కేవలం 10% మాత్రమే సినిమాలో చూపించామంటూ హీరో ముకుందన్ అనడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాపై తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇటీవల ఈ మార్కో చిత్రాన్ని థియేటర్లో చూశాను. ఆ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలా అసహజంగా అనిపించాయి. ముఖ్యంగా సెకండాఫ్ సీన్లు అయితే నేను,నాతో పాటు నా భార్య చూడలేకపోయామంటూ చెప్పుకొచ్చారు. సినిమా చూస్తున్న సమయంలో నా భార్య నిండు గర్భిణి. హింసాత్మక సన్నివేశాలను చూస్తూ నా భార్య భయపడిపోవడంతో సినిమా సెకండాఫ్ మధ్యలోనే థియేటర్ నుంచి వెళ్లిపోయామని చెప్పుకొచ్చాడు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు అంటూ అంతటి హింస ని మేము భరించలేము అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.
