Dilruba Movie Review

Reviews

కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ రివ్యూ! ‘క’ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కు సినిమా ఇండస్ట్రీలో చాలా గౌరవం పెరిగింది. ఎప్పుడైతే క సినిమా హిట్ అయిందో అప్పటినుంచి కిరణ్ అబ్బవరం స్టైల్ అండ్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. క సినిమా అనేది కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే   పెద్ద హిట్ కొట్టడంతో  దిల్ రూబా  సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఎన్నో భారీ అంచనాల నడుమ కిరణ్ అబ్బవరం కొత్త సినిమా  దిల్ రూబా సినిమా  అయ్యింది. ఈ సినిమా పబ్లిసిటీ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ కనుక నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి అంటూ స్వయంగా దిల్ రూబా సినిమా  నిర్మాత అనడం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీటన్నిటి మధ్య దిల్ రూబా  సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?.. కిరణ్ అబ్బవరం కష్టం ఫలిస్తుందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. 

 సిద్ధార్థ్  పాత్రలో కిరణబ్బవరం ది  ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. తను ప్రేమించిన మ్యాగీ (నజియా)అనే అమ్మాయితో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది. నమ్మిన స్నేహితుడు తన తండ్రిని మోసం చేయడంతో సిద్ధార్థ తట్టుకోలేక పోతాడు. అప్పటినుంచి ప్రేమనే ఎమోషన్ కు హీరో దూరమవుతాడు. సారీ మరియు థాంక్స్ ఈ రెండు పదాలకు కూడా హీరో అసలు విలువ ఇవ్వడు. అంతేకాదు తాను ఎవరికీ సారి మరియు థాంక్స్ అనేవి చెప్పడు. ఇలాంటి సిద్ధార్థు లైఫ్ లోకి అంజలి( రుక్సార్ తిల్లాణ్ ) అనే అమ్మాయి వస్తుంది. చివరికి హీరో మ్యాగీ అనే అమ్మాయిని మర్చిపోయే అంజలి ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వల్ల వీళ్ళ మధ్య కూడా గ్యాప్ అనేది వస్తుంది. ఇక వీళ్ళిద్దరిని కలపడానికి మ్యాగీ అమెరికా నుంచి తిరిగి వస్తుంది. అసలు మ్యాగీ ఇండియాకి ఎందుకు వచ్చింది? చివరికి హీరో ఎవరిని ప్రేమిస్తాడు? ఈ కథంతా ఎక్కడ మలుపు తిరుగుతుంది అనేదే దిల్ రూబా  సినిమా. 

 ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లు చాలా బాగా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ ఫైట్ సూపర్ గా ఉంటుంది. హీరో, హీరోయిన్లతో పాటు  తోటి నటులు కూడా చాలా బాగా నటించారు. ఇక శ్యామ్ నేపద్య సంగీతం, తాను అందించిన పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. కాగా  మొత్తానికి ఈ సినిమా ‘క’ సినిమా కన్నా కొంచెం వెనకబడింది అని చెప్పాలి.