విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన కలిసి నటించిన సినిమా చావా. చత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరికెక్కిన ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించారు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే చత్రపతి శివాజీ మరణంతో ప్రారంభమవుతుంది. చత్రపతి శివాజీ చనిపోవడంతో మరాఠా సామ్రాజ్యం కుప్పకూలి పోతుందని మొగల్ రాజు భావించి ఔరంగజేబు సంబరాలకు సిద్ధమవుతారు. కానీ శివాజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ చత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మొగల్ సామ్రాజ్యానికి అడ్డుగోడగా నిలబడతాడు. అయితే శంభాజీని పడగొట్టాలని పంతం పట్టిన ఔరంగజేబు.. అది అంత తేలిక కాదని అర్థం చేసుకుని కుట్రపూరితంగా శంబాజీ ని పడగొట్టడానికి ప్లాన్లు వేస్తాడు. మరి ఆ ప్రయత్నంలో అతను విజయం సాధించాడా?.. శంభాజీ మహారాజ్ ఔరంగజేబు చేతికి చిక్కుతాడా?.. చివరికి అతడి కథకు ముగింపు ఏంటి అనేదే ‘చావా ‘ కథాంశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హవా కొనసాగుతోంది. భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ధియేటర్లలో సందడి చేస్తూ భారీ వసూళ్లను రాబడుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా హిందీలో మాత్రమే కొనసాగగా నేడు గీతా సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. చత్రపతి శివాజీ తనయుడు శంభాజీ పాత్రకు అదిరిపోయి ఎలివేషన్ ఇవ్వడంతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ విజయవంతం అయ్యాడు. ఈ కథతో కనెక్ట్ అయిన వాళ్లకు సినిమా చివరకు వచ్చేసరికి గుండె బరువెక్కి… కన్నీళ్లు పెట్టడం ఖాయం అనిపిస్తుంది.
ఈ సినిమాలో హీరో ఎంట్రీ ఎపిసోడ్ తర్వాత కథనం కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. కోట లోపలి వ్యవహారాలు మరియు సన్నివేశాలు కొంచెం మామూలుగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఔరంగజేబు పాత్ర మాత్రం అప్పుడప్పుడు మెరుపులు మెర్పిస్తూ ఉంటుంది. హిందీ ఆడియోస్ అంతగా ఉద్వేగానికి గురి అయ్యే అంతగా ఏముంది ఇందులో అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు కథ తర్వాత మొదలవుతుంది. ఔరంగజేబు మీద శంభాజీ తన సైన్యంతో మెరుపు దాడులు చేసే సీన్లతో చావా సినిమా ఊపొందుకుంటుంది. శంభాజీ మహారాజ్ విశ్వరూపం ఏంటో మనం ఆ సమయంలో చూస్తాము. కథను చెప్పడంలో ఎంచుకున్న కోణం అందరికీ అభ్యంతరంగా అనిపించవచ్చు. ఇందులో చూపించిందంతా కూడా నిజమా లేదా అబద్ధమా అనే చర్చలు జరుపుతాం. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు. వాళ్ల యొక్క పాత్రలకు న్యాయం చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిగా క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ నటన అయితే వేరే స్థాయిలో ఉంటుంది. ఇక రష్మిక మందన ఎప్పుడు చేయని పాత్ర ఈ సినిమాలో చేసింది. ఎక్కువగా మాట్లాడకుండా హావాభావాలతోనే క్రూరత్వాన్ని పలికించడంలో అక్షయ్ తన నైపుణ్యాన్ని చాటాడు. ఇక టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా బాగా అనిపించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం కొంచెం తగ్గింది అని చెప్పాలి. కొన్నిచోట్ల ఎమోషనల్ సీన్స్ సరిగా కుదరలేదు అనిపిస్తుంది. లక్ష్మణ్ టేకింగ్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా చివరి గంటలు అతను సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు మాత్రం చాలా బాగుంటుంది. (గమనిక: ఈ రివ్యూ /సమీక్ష రచయిత/సమిక్షుడి వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే.)

The best databases for Xrumer 23 ai and GSA Search Engine Ranker
We offer the best website databases for working with Xrumer 23 ai Strong and GSA Search Engine Ranker. The databases are suitable for a professional SEO company and creating hundreds of thousands of backlinks. Our databases are used by many SEO professionals from different countries of the world. The price for the databases is low, having bought them you receive updates for 12 months. You can read more and order a subscription to the databases here: https://dseo24.monster/vip-base-for-xrumer-and-gsa-ser/ On the site page you can choose any language of the pages.