తండేల్ మూవీ రివ్యూ…అక్కినేని యువ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ రివ్యూ ని ఇప్పుడు మనం చూద్దాం. చందు ముండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా బన్ను వాసు నిర్మించారు. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. తండేల్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలు హైలైట్ గా నిలిచేలా ఉంది. ఇక రిలీజ్ ఒకరోజు ముందు ఆజాద్ సాంగ్ వదిలారు అది కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి శ్రీమని లిరిక్స్ అందించిన సాంగ్ కూడా అదిరిపోయింది. తండేల్ సినిమాతో నాగచైతన్య కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చేలా ఉందని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు మనం ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. హీరో నాగచైతన్య మరియు హీరోయిన్ సాయి పల్లవి నటన చాలా అద్భుతంగా ఉంది. అలాగే సహాయకంగా నటించిన ఆర్టిస్టులు రావు రమేష్ మరియు కరుణాకరన్ నటన వేరే లెవల్ అని అంటున్నారు.
కాగా శ్రీకాకుళంలో నివసిస్తున్న నాగచైతన్య సముద్రంలో చేపలు పడుతూ జీవితం గడుపుతుంటాడు. తన చిన్ననాటి ప్రేయసి అంటే సాయి పల్లవి నీ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రాజు తన తండేలు టీం అంతా ఒకసారి సముద్రం లోకి వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేస్తారు. వారిని పాకిస్థాన్ ఆర్మీ అరెస్టు చేస్తుంది. రాజు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడని తెలిసి సత్య ఏం చేసింది, అతని విడిపించడానికి ఆమె పడిన కష్టం ఏంటి అనేది సినిమా కథ. ఇక ఫస్ట్ ఆఫ్ అంతా కూడా నాగచైతన్య మరియు సాయి పల్లవి లవ్ ట్రాక్ నడుస్తుంది. ఎందుకో ప్రేక్షకులకు ఈ సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అంతేకాదు ఫస్టాఫ్ చాలా స్లోనిరేషన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఇంటర్వెల్ కాస్ట్ ఇంప్రెస్ చేసిన సెకండ్ హాఫ్ లో కాస్త సినిమా ఎంగేజ్ చేస్తుంది . సినిమా మొత్తం కూడా నటీనటుల నటన, సినిమాటోగ్రాఫర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని కూడా క్లైమాక్స్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సినిమాలో నాగచైతన్య మరియు సాయి పల్లవి జంట ఇంప్రెస్ చేసిన ఎక్కడో వీళ్లిద్దరూ కెమిస్ట్రీ విషయంలో డౌట్ పడేలా చేస్తుంది. ఈ సినిమాలు పాకిస్తాన్ ఎపిసోడ్స్ కొంతమేరకు బెటర్ అనిపిస్తాయి. ఓవరాల్ గా తండేల్ సినిమా ఒకసారి చూసే సినిమాగా ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ నాగచైతన్య, సాయి పల్లవి, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, క్లైమాక్స్. కాగా ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్, స్లో నరేష్ న్, బాటమ్ లైన్.
గమనిక: ఈ రివ్యూ /సమీక్ష రచయిత/సమిక్షుడి వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే.