దేవర మూవీ రివ్యూ

Reviews

దేవర మూవీ రివ్యూ వచ్చేసింది… హిట్టా?.. లేక ఫట్టా..? చూసేయండి…జూనియర్ ఎన్టీఆర్ తన చివరి మూవీ RRR. ఇప్పటికీ దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత దేవర మూవీతో ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఇవాళ థియేటర్ వద్ద రిలీజ్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపుగా ఐదారు భాషల్లో రిలీజ్ అవుతున్న దేవర మూవీ ఇప్పుడు అందరు దృష్టిలో ఇది బ్లాక్ బస్టర్ కొడుతుందా లేదా అనే ఆందోళనలో పడ్డారు. అయితే రిలీజ్ అయినటువంటి మూవీ ఇప్పటికే థియేటర్లో ఆడుతుంది. ఇక దేవర మూవీ రివ్యూ విషయానికి వస్తే అందరిలోనూ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దేవర సినిమా విషయానికి వస్తే ఎమోషనల్ మరియు పవర్ఫుల్ పాత్రలతో ఓ డిఫరెంట్ జానర్ మూవీ. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. అయితే జాన్వి కపూర్ ఫ్యాన్స్ మాత్రం కొంత నిరాశ చందాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ అఫ్ చాలా బాగుండగా సెకండాఫ్ కొంచెం రొటీన్ అయిపోయింది. రెండు పార్టీలుగా అందరి మైండ్ సెట్ లో నింపుదామని చూడగా అది కొంచెం నిరాశ అనిపించింది. అయితే ఈ దేవర మూవీకి అత్యంత బలమైన కాన్సెప్ట్ ఏంటంటే అది అనిరుద్ మ్యూజిక్ అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ. వీళ్ళిద్దరూ కలిపి సినిమాను ఓ రేంజ్ లో పెట్టారు. అనిరుద్ మ్యూజిక్ తో రత్నవేలు సముద్ర తీరాన్ని అలాగే కొండ ప్రాంతాన్ని చక్కగా చూపించారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు అనేవి చాలా బాగున్నాయి. విషయానికి వస్తే ఎన్టీఆర్ రెండు విభాగాలలో డ్యూయల్ రోల్ కేక పెట్టించాడు. ఇక జాన్వి కపూర్ అయితే తను ఉన్నంత సేపు తన గ్లామర్ తో అందరిని మెప్పించేస్తుంది. ఈ సినిమాలో విలన్ గా క్యారెక్టర్ చేసిన సైఫలికాన్ అయితే ఒక డిఫరెంట్ గా కొత్తగా ఎలివేషన్ విలనిజం చూపించాడు. ఇక ముఖ్యపాత్రను పోషించినటువంటి ప్రకాష్ రాజ్,అజయ్,శ్రీకాంత్ వాళ్ళ యొక్క క్యారెక్టర్లు మునిగిపోయి పర్వాలేదనిపించారు. ఇక ఓవరాల్ గా సినిమా మొత్తం రేటింగ్ గురించి చూసుకుంటే మరి బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ హిట్ అని మాత్రం చెప్పగలం. అయితే ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టే చిత్రంగా ఈ సినిమాని తీసుకోవచ్చు.

ASTROLOGY MATRIMONY REAL ESTATE VASTU CONSULTANTS OVERSEAS CONSULTANTS