చిరంజీవి గారిని 8 సంవత్సరాల చిన్న పిల్లల నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. చిరంజీవి గారికి 70
సంవత్సరాల అంటే ఎవరు నమ్మరు, ఆయన ఉత్సాహం గ్రేస్ చూస్తే ఇప్పటికే 25 సంవత్సరాల యువకుడు లాగే కనిపిస్తారు.
మూడు తరాల వారి హృదయాల్లో గొప్ప హీరోయిజం నింపిన చిరంజీవి
నేడు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా వెలుగుతున్న హీరోల తండ్రుల హీరోగా రాణిస్తున్న సమయంలోనూ మెగాస్టార్ వారికి పోటీ ఇచ్చారు నేడు ఈ తరం హీరోలకు పోటీ ఇస్తున్నారు.
అసలు “చిరు” వయస్సు 68 లేక 28 నా ఈ వయస్సులోను ఇంతటి ఉత్సాహం గా ఉండటం,అద్బుతమైన డాన్స్ లు చేయటం చూసిన ఎవరైనా అద్బుతం “చిరు” నిజంగా “YOU ARE ALWAYS MEGA STAR” అంటారు.
చిరంజీవి ఈ పేరు విన్నా,టెలివిజన్,పేపర్ లో ఆయన చిత్రం చూసినా ఏదో తెలియని ఉత్సాహం.చిన్న పిల్లలు నుండి పెద్దవారు వరకు ఆయనంటే క్రేజ్. సినీ రంగం లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నను, స్వయంకృషి తో తన టాలెంట్ టాలీవుడ్ లో నెం 1 స్తానం పొంది కోట్ల అభిమానుల్లో గుండెల్లో అభిమానం సంపాదించుకున్న నటులు చిరంజీవి.
చిరంజీవి గారు సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే ఆయన కళ్లలోని పవర్ చూసి,ఆయన యాక్షన్,డాన్స్ చూసి కళ్లులా ఉన్నాయి.అతి త్వరలో తెలుగు సినీరంగాన్నీ ఏలే “రారాజు”అయ్యి ప్రేక్షకులు గుండెల్లో ఖైది అవుతారు అంటూ సినీ దిగ్గజ దర్శక,నిర్మాతలు తెలిపారు .
వర్ధమాన నటి,నటులు ఎక్కువగా మీము సినీ రంగంలోకి వచ్చామంటే చిరునే స్పూర్తి అని చెపుతారు.
చిరంజీవి గారు వేసే డాన్స్ లు అనుకరించాలన్నా మా వల్ల కాదు ఆయన సినీ రంగంలో నాట్యానికి కొత్త ఒరవడి దిద్దిన గ్రేట్ హీరో అని చెపుతారు.
ఆ నాటి నుండి,ఈ నాటి వరకు కళాశాల,పాఠశాల ఫంక్షన్స్ లో ఇప్పటికి చిరు నటించిన సినిమా పాటల స్టెప్స్ ను వేసి బహుమతులు సాధిస్తున్నారు అంటే చిరు క్రేజ్ ఏ స్తాయి లో ప్రజల హృదయాల్లో ఏ “రేంజ్” లో ఉందో ఊహించుకోవచ్చు.
స్యయంకృషి,వృత్తి పట్ల గౌరవం ఉంటే ఎంతటి ఉన్నత స్తానాలు పొందవచ్చో నిరూపించిన వ్యక్తి చిరంజీవి గారు.
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,చిన్నచిన్న పాత్రలు కూడా చేసిన ఆయన తెలుగు సినీ రంగంలో “రారాజు” గా ఎదిగారు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక మూస లో వెళ్తున్న సమయంలో తన డాన్స్,స్టయిల్ తో ఒక ప్రత్యేకతను తెచ్చి అభిమానుల ను ఉర్రూతలూగించారు.
ఆయన నటన కు అత్యున్నత పద్మభూషణ్ తో పాటు అనేక అవార్డ్ లు వరించాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్,
ఐ బ్యాంకు ద్వారా ఆయన చేస్తున్న సేవ కు కూడా అనేక అవార్డ్ లు లభించాయి.
ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎందరికో స్పూర్తి ఇచ్చాయి..
ఆ స్పూర్తి నేను తీసుకున్నాను అని గర్వంగా చెప్పగలను.
1980 ప్రాంతంలో ఆయన్ను ఇష్టపడని, ఆయన్ని ఫాలో కాని యువత లేరంటే అతి శయోక్తి కాదు.
ఆయన డాన్స్ లు నేటి తరం ఎందరో ప్రముఖ డాన్సర్ల కు,నటులకు ఆదర్శం.
ఆయన నటించిన ఖైది సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.
గూండా, యముడికి మెగుడుకొండవీటి దొంగ,గ్యాంగ్ లీడర్,ఠాగూర్, స్యయంకృషి,ఇలా అనేక సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. జగదేక వీరుడు-అతిలోక సుందరి అయితే మాచర్ల వెంకటేశ్వర ధియేటర్ లో మా మిత్ర బృందం లో ని వారమే దాదాపు 25 సార్లు చూసి ఉంటాము.
ఆయన డైలాగ్ చెప్పినా,రౌద్రంగా సింహం కళ్ల తో చూసినా,డాన్స్ వేసినా,కామెడీ చేసినా అన్ని హైలైట్ అనే ప్రేక్షకులు చెపుతారు. కొండవీటి దొంగ సినిమాలో “చమ్మక్ చమ్మక్ చాం పట్టుకో” అనే సాంగ్ లో చిరు క్లాస్ స్టెప్స్ చూసి అప్పట్లో మాచర్ల వెంకటేశ్వర థియేటర్ లో తెర మీద రూపాయి కాయిన్స్ వేసి అభిమానులు చేసిన సందడి ఇప్పటికి మర్చిపోలేము. జగదేకవీరుడు అతిలోక సుందరి లో “అబ్బ నీ కమ్మని దెబ్బ” పాట లో చిరంజీవి నృత్యం ఒక ఇప్పటికి ఒక ట్రెండ్ సెట్టర్. అసలు ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా వారెవ్వా!చిరు ఏమి డాన్స్,ఏమి నటన,ఏమి డైలాగ్స్ అంటూ పొగడకుండా సినిమా చూడలేము.
“ఇంద్ర” సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఇప్పటికి పాపులర్. ఆయన సినిమా రిలీజు తేది అంటే ఆ రోజు కళాశాల లు నిర్మానుష్యం అయ్యేవి. సాధారణ నటుడి గా మొదలైన చిరంజీవి ప్రస్తానం ఖైది సినిమాతో మలుపు తిరిగి గ్యాంగ్ లీడర్,ఇంద్ర,ఠాగూర్ సమయానికి కోట్లాది అభిమానుల గుండెల్లో చిరంజీవి లా నిలిచేలా సాగింది,అనేక మంది యువ నటులు ఆయన ఆదర్శంగా తీసుకుంటారు.
ఆయన సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసే డాన్స్ మాస్టర్ అది తమ జీవితంలో ఒక వరంగా భావిస్తారు.
“ఘరానా మొగుడు” సినిమా సమయం లో రూపాయి,రెండు రూపాయిల టికెట్ రేట్లు ఉన్న సమయం లో నే 10 కోట్లు గ్రాస్ కొల్లగొట్టి బాలీవుడ్ ను సైతం ఆశ్చర్య పరిచారు.
ఆ సమయం లో అంతర్జాతీయ పత్రికలు ఆయన పొటోలు కవర్ పేజి లో ప్రచురించి గౌరవం చాటాయి.అప్పట్లో చిరంజీవి గారి క్రేజ్ అటువంటిది.
“విజేత” సినిమా చూసి మహిళా ప్రేక్షకులు చిరంజీవి కి బ్రహ్మరధం పట్టారు,తమ ఇంట్లో కూడా ఇలాంటి కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి వుంటే బాగుండు అని అనుకున్నారు.
మగ మహారాజు సినిమా చూసి పెద్ద చదువులు చదివి, చిన్న పనులు చేయలేక సిగ్గు పడి,ఏ ఉద్యోగం చేయక కుటుంబానికి భారంగా మారే యువత మారి ఏదో ఒక వృత్తి లో చేరి కుటుంబానికి ఆసరా గా నిలిచారు.
అలా మారిన తన కుమారులు ని చూసి గర్వపడుతూ చిరంజీవి గారికి కొంత మంది ఉత్తరాలు రాసారని అప్పట్లో పత్రికలు వార్తలు వ్రాసాయి.
ఏ రంగం లో అయినా కష్టపడే వారికి చిరంజీవి స్పూర్తి గా నిలుస్తారు.
కష్టపడితే ఉన్నత స్తానాలు సాధించవచ్చి అని నిరూపించిన వ్యక్తి గా ఆయన అందరికి ఆదర్శ ప్రాయుడు. ఆయన నటించిన రుద్రవీణ సినిమా కుల,మత భేధాలు పట్టించుకునే వారికి ఒక కనువిప్పు,మద్య పానం అనర్ధాలు తెలిసేలా చేసింది.ఒక గ్రామం లో స్యయం ఉపాధి శిక్షణ కల్పిస్తే వారు ఎంత అభివృద్దిచెందుతారో కూడా ఈ సినిమా ద్వారా తెలియచేసారు. రుద్రవీణ సినిమా గ్రామాభ్యుదయం ఎలా సాధించాలో గొప్పగా చూపుతుంది.చూడనివారు ఈ సినిమా ఇప్పుడయినా చూడండి.
సొంత గ్రామం,పుట్టిన ఊరు కోసం మనం ఏం చేయలో తెలుస్తుంది.
68సంవత్సరం లోకి అడుగు పెడుతున్న కూడా చిరంజీవి గారు నేటికి యువకుని గానే కనిపిస్తూ తన కుమారుడు
రాం చరణ్ కు సోదరుడు అంటే నమ్మేలా కనపడుతున్నారు,
తన సినీ జీవితానికి దాదాపు 10 సంవత్సరాలు విరామం తరువాత నటించిన ఖైది నెంబర్ 150 సినిమాలో ఆయన నటన అమోఘం,అద్బుతం. మరలా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టారు.
ఈ సినిమా లో “రత్తాలు రత్తాలు””అమ్మడు-లెట్స్ డు కుమ్ముడు” పాటలకు . అభిమానులు ధియేటర్ లో కుర్చీలలో నుండి లేచి డాన్స్ లు వేసారు..
5 సంవత్సరాల పిల్లలు కూడా అమ్మడు-లెట్స్ డు కుమ్ముడు అంటూ ఇప్పటికి యూట్యూబ్ లో గాని,టి.వి.లో కాని పాట చూసి నాట్యం చేస్తున్నారు . చిరంజీవి గారి గురించి ఇలా రాసుకుంటే పోతే 100 పేజిలు కూడా చాలవు,మా కాలేజి డేస్ లో ఆయన మాకు అత్యంత ప్రభావితం చేసే హీరో గా నిలిచారు. వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల వర్షం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చిరు సత్తా ఏమిటో మనకు తెలియజేసింది.
త్వరలో వస్తున్న చిరు గారి “విశ్వంభర” మరియు అనిల్ రావిపూడి గారి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ దుమ్ము దులిపే కలెక్షన్స్ వర్షం కురవాలని
మరియు ఆయన ఆయురాగోగ్యాలతో ఎల్లప్పుడు “చిరంజీవి” గా ఉండాలని అభిమానులందరి తరపున ప్రార్ధిస్తున్నాం. HAPPY BIRTH DAY TO U MEGA STAR CHIRANJEEVI GARU. – శ్రీ వేముల