టాలీవుడ్లో కామెడీతో నవ్వించగలిగే ఒకే ఒక వ్యక్తి అది హాస్యనటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం తన మాటలతో బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నవ్వించగలిగే శక్తి అతనికి ఉంది. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా బ్రహ్మానందం మరియు తన కొడుకు నటించినటువంటి సినిమా “బ్రహ్మ ఆనందం”. ఈ సినిమా మోషన్లలో భాగంగా బ్రహ్మానందం యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణను తలుచుకొని బాగోద్వేగానికి గురయ్యాడు. ఎమ్మెస్ నారాయణ చివరి క్షణాలు ఎప్పుడు తలుచుకున్న కూడా నా కంట్లో కన్నీళ్లు తిరుగుతాయని అన్నారు. నాకు చాలా మంచి మిత్రుడు ఎంఎస్ నారాయణ అంటూ అతను చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో జరిగే ఎన్నో విషయాలు గురించి మరియు సినిమా ప్రయాణం గురించి బ్రహ్మానందం ఆ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు. ఎమ్మెస్ నారాయణ డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్లు తిరుగుతూ ఉంటాయని చెప్పినా బ్రహ్మానందం… చివరికి ఎమ్మెస్ నారాయణ కి కూడా విషయం తెలిసి అంటూ చెప్పవచ్చారు. అతను కచ్చితంగా చనిపోతాడని తెలిసిన కొద్ది క్షణాలు ముందే తన కూతురితో బ్రహ్మానందం ని కలవాలని ఉందని మాటలు రాని పరిస్థితులలో కూడా ఒక కాగితంపై రాసి తన కూతురికి ఇచ్చి బ్రహ్మానందం ని పిలిపించమని కోరారు. ఈ విషయం తన కూతురు నాకు వెంటనే ఫోన్ చేసి అలా చెప్పడంతో వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ మధ్యలోనే ఎవరికి చెప్పకుండా వచ్చేసానని ఇంటర్వ్యూలో తెలిపారు బ్రహ్మానందం. ఇలా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ నారాయణ చివరి క్షణాలు గురించి చెబుతూనే బ్రహ్మానందం ఇంటర్వ్యూలో బాగోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ గురించి మాట్లాడిన వ్యాఖ్యలనేవి సంచలన సృష్టిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చిస్తున్నారు. ఎమ్మెస్ నారాయణ మరియు బ్రహ్మానందం ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచిగా చక్కగా ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ ఉండేవారు. అలాంటిది ఎమ్మెస్ నారాయణ లేని లోటు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనబడుతుంది.
