రాజాసాబ్ గ్లింప్స్ లో లో మెరిసిన ప్రభాస్

Cinema

రాజాసాబ్ గ్లింప్స్ లో లో మెరిసిన ప్రభాస్… మునిపెన్నడూ లేని కొత్త కథతో ముందుకి.. హిట్ కొట్టేనా…ప్రభాస్ హైట్ కి కెరీర్ బిగినింగ్ లో చత్రపతి మరియు యోగి లాంటి యాక్షన్ మూవీలతో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ ఫ్యాన్స్ ని మూట కట్టుకున్నాడు. అయితే అన్ని రంగాల నుంచి ఎదగాలనుకునే ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఉన్నాడు. డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ లతో మహేష్ బాబుతో సమానంగా లేడీ ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు ప్రభాస్. బాహుబలి వరకు ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంది. సాహో మూవీలో ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రభాస్ ముఖంలో ఒకప్పటి గ్లో మిస్ అయ్యింది. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల్లో కూడా ప్రభాస్ లుక్ పరంగా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. BEST OPEN PLOTS IN HYDERABAD – FREE SITE VISIT – GOOD PROJECT హ్యాండ్సమ్, లవర్ బాయ్ గా ఫెయిర్ లుక్ లో ప్రభాస్ ని చూడాలన్న కోరికను దర్శకుడు మారుతి తీర్చాడు. నేడు విడుదలైన గ్లింప్స్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని ఆకాశానికి ఎత్తుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత అద్భుతంగా ప్రభాస్ ని ప్రజెంట్ చేశాడు మారుతి.ఇప్పుడు వారి అభిప్రాయం మారిపోయి ఉంటుంది. తిట్టిన నోళ్లు నేడు మారుతిని పొగుతాయి. ఇక రాజా సాబ్ గ్లింప్స్ గురించి చెప్పాలంటే… మనసులు దోచేసింది. ఫీల్ గుడ్ టీజర్ అని చెప్పవచ్చు. బైక్ పై వచ్చిన ప్రభాస్… అక్కడ ఆగి వున్న ఖరీదైన వింటేజ్ కారు అద్దంలో ఫేస్ చూసుకుంటాడు. తన అందానికి మురిసిపోయి చేతిలో ఉన్న బొకే లో పూలు కోసి అద్దం మీద చల్లుతాడు. ఆ టైంలో ప్రభాస్ ని చూస్తున్న ఫ్యాన్స్ స్వర్గానికి వెళ్ళినట్లుగా బాగోద్వేగం పొందుతారు. ఎప్పుడు యాక్షన్ మూవీలు చేసి కోపంగా ఉండడం గమనిస్తాం. కానీ ఈ మూవీలో ప్రభాస్ స్టైల్ అండ్ లుకింగ్ జనాలకి ఈ పిచ్చెక్కిస్తున్నట్లే అని చెప్పవచ్చు. ఫ్యాన్ ఇండియా లెవల్లో ఈజీగా వెయ్యి కోట్లు దాటగల టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ వల్లే సాధ్యం. మరి ఈ సినిమా ఎన్ని కోట్లను రాబడుతుందో తెలుసుకోవాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాల్సిందే.

ఉత్తమ ఆస్ట్రాలజీ సర్వీసులు కోసం చూస్తున్నారా…