నితిన్ సినిమాలో డేవిడ్ వార్నర్

Cinema

టాలీవుడ్ యంగ్ హీరో  నితిన్ తాజాగా  ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకి వచ్చింది.  హీరో నితిన్ మరియు శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ.. ఒక సాలిడ్ హిట్ అందుకోవడంతో  ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా పైన కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో… ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ సినిమా చిత్ర బృందం ప్రకటించింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ అయిన డేవిడ్ వార్నర్ నటనపై ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. నిన్న మొన్నటి వరకు కూడా  అల్లు అర్జున్ పుష్ప సినిమాకు అలాగే మహేష్ బాబు  సినిమాలోని పాటలకు తనదైన స్టైల్ లో స్టెప్పులేస్తూ  సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని తెచ్చుకున్నారు. ఇక తాజాగా డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. ఏంటంటే రాబిన్ హుడ్  మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించినందుకు ఆయన ఏకంగా 50 లక్షల రూపాయిగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే డేవిడ్ వార్నర్ ఇంత రెమ్యూనిరేషన్ కావాలని డిమాండ్ చేయలేదట. కానీ మేకర్స్ డేవిడ్ వార్నర్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది అఫీషియల్ గా తెలియక పోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలను చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా డేవిడ్ వార్నర్  స్థాయికి ఈ రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని అంటున్నారు. 

FIND BEST MATRIMONY SERVICE FOR TELUGU COMMUNITY PEOPLE