టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత అనే పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు . టాలీవుడ్ హీరోలతో సమానంగా సమంతకు క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన వివాహ జీవితంలో ఒడిదుడుకులు మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కారణంగా సమంత ఇటీవల సినిమాల్లో కాస్త వెనకబడింది. కానీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీలు ఇస్తుంది. తాజాగా వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అయ్యేందుకు సిద్ధమవుతుంది. అయితే తాజాగా సమంత తన కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అనేవి చేసింది. కెరీర్ మొదటలో కొన్ని పాత్రలు చేయకుండా ఉండాల్సింది అంటూ ఓపెన్ అవుతూ చెప్పకు వచ్చింది.
సినిమా రంగంలో నటిగా ప్రయాణం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. ప్రతి విజయం నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. సినిమా కెరీర్ ఆరంభంలో సినిమాల ఫలితాల గురించి చాలా టెన్షన్ పడేదాన్ని. కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలు ఇప్పుడు చూసినప్పుడు విచిత్రంగా అనిపిస్తున్నాయి. అలాంటివి చేయాల్సింది కాదని భావిస్తున్న అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. అయితే సమంత ప్రస్తుతం మయోసైటీస్ బారినపడి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. 2023వ సంవత్సరంలో శాకుంతలం మరియు ఖుషి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు పరవాలేదు అనిపించినా ఆ తరువాత మరో పూర్తి స్థాయి సినిమాలో కనిపించలేదు సమంత. అయితే సిటాడిల్, హనీ బన్నీ… ఈ రెండు వెబ్ సిరీస్ లో నటించి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండా.. ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్ లలో సమంత నటిస్తుంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తన పాత సినిమాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అలా నటించకుండా ఉండాల్సింది అని బాధపడడం… అనే విషయాలను ఇప్పుడు సమంత చెప్పడం సమంత అభిమానులు అందరూ కూడా దిగులు చెందుతున్నారు.