వీరేంద్ర సెహ్వాగ్ అంటే తెలియని వారు మనదేశంలో ఎవరు ఉండరు. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి వీరేంద్ర సెహ్వాగ్ అంటే కచ్చితంగా తెలిసే ఉంటుంది. అతని ఆట, మన టీమిండియా తరఫున ఆడిన అతని అనుభవం చాలానే ఉంది. అయితే తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి విడిపోనున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అనేవి తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య విడిపోనున్నట్లుగా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మధ్య చాలా మంది క్రికెటర్స్ జంటలు విడిపోతున్న విషయాలు మనందరికీ సోషల్ మీడియా వేదికగా తెలిసినవే. ఇప్పుడు మళ్లీ మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జంట విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మన టీమ్ ఇండియా జట్టు తరఫున ఎంతోమంది ప్లేయర్లకు స్ఫూర్తినిచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో మ్యాచ్లకు మన టీమ్ ఇండియాకు సపోర్ట్ చేస్తూ, ప్లేయర్లు అందరినీ ఎంకరేజ్ చేస్తూ నిత్యము సోషల్ మీడియాలో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో విడాకుల సమాచారం అనేది నడుస్తుంది. టీమిండియా మాజీ ఓపెన్ అయినటువంటి వీరేంద్ర సెహ్వాగిసారి ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. దాదాపుగా వీరేంద్ర సెహ్వాగ్ కు పెళ్లి అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా అర్థమవుతుంది. వీరేంద్ర సెహ్వాగ్ భార్య అయినటువంటి ఆర్తి అహ్లావత్ ఇద్దరు కూడా విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో సమాచారం తెగ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికి కూడా తెలియదు. కేవలం సోషల్ మీడియా వేదిక అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ విడాకుల సమాచారానికి బలం చేకూరింది.
కాగా వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఆర్తి అహ్లావత్ 2004వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో వీరిద్దరూ బంధువులు మరియు స్నేహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఆర్య వీర్ మరియు వేదాంత్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఆర్తి వివాహం చేసుకొని దాదాపుగా రెండు దశాబ్దాల పాటు జీవితాన్ని కొనసాగించారు. కానీ ప్రస్తుతం ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా కొన్ని నెలల కిందట వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతోనే ఈ విడాకులు తీసుకోనున్నట్లుగా సమాచారం అందింది. ఏది ఏమైనా సరే స్టార్ మాజీ క్రికెటర్ అయినటువంటి వీరేంద్ర సెహ్వాగ్ తన భార్యతో విడాకులు తీసుకోవడం అనేది తన అభిమానులకు జీర్ణించుకోలేనటువంటి విషయం. ప్రతిరోజు కూడా కొంతమంది స్టార్ సెలబ్రిటీలు విడిపోవడం అనేది మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి విషయమే.
ఇక ఈమధ్య సహవాగ్ చేసే ప్రతి ఇన్స్టా పోస్టులో తన సతీమణి లేకపోవడంతో కచ్చితంగా వీరిద్దరు విడాకులు తీసుకుంటారని ఊహగానాలు అయితే ప్రతి ఒక్కరిలోనూ మొదలవడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం జరిగినటువంటి దీపావళి సెలబ్రేషన్స్ లో కూడా తన ఇద్దరు కుమారులతోపాటు తల్లితో మాత్రమే ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక చివరిసారిగా 2023లో వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఆర్తి పెళ్లిరోజు సందర్భంగా తన భార్య ఫోటోను ఇన్స్టాలో పంచుకున్నారు. ఇక అప్పటినుండి ఒక్కసారి కూడా సోషల్ మీడియా వేదికగా తన భార్య ఫోటోను వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో పంచుకోలేదు. కాబట్టి వీరిద్దరి విడాకుల పుకారైతే కచ్చితంగా నిజమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తాజాగా వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా అన్ని సామాజిక మాధ్యమాలలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకులు వార్తలకు మరింత బలం అనేది చేకూరింది. అయితే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ విడిపోతున్నట్లు ఎన్ని న్యూస్ చానల్స్ లలో మరియు న్యూస్ మీడియాలలో వస్తున్న కానీ ఒకవైపు వీరేంద్ర సగవాకు మరోవైపు అతని భార్య ఆర్తి అహ్లావత్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. మరి ఇప్పటికీ వీరిద్దరూ స్పందించకపోవడానికి కారణాలు అయితే ఎవరికి కూడా తెలియదు. కానీ వీరిద్దరూ విడిపోవడం మాత్రం ఖచ్చితమే అని తెలుస్తోంది. అయితే ఈ మధ్య ఎంతో మంది స్టార్ క్రికెటర్లు తమ భార్య నుండి విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదేదారిలోకి వీరేంద్ర సెహ్వాగ్ కూడా వెళ్లనున్నట్లు అందరూ అనుకుంటున్నారు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ మరియు తన భార్య ఆర్తి విడిపోవడం అతని అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరూ కలిసే ఉంటారా లేదా విడాకులు తీసుకుంటారనే విషయం వారు మీడియా వేదికగా చెప్పడం ద్వారానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అప్పటివరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండాల్సిందే.
ASTROLOGY VASTU – MARRIAGE SERVICE – REAL ESTATE – EDUCATION INFORMATION