మళ్లీ మెల్లగా తెరపైకి వస్తున్న… మూడు వివాదాలు!… ఇప్పట్లో ఆగేలా లేవుగా? ఒక ఏడాది క్రిందట ఎంతో వివాదాస్పదమైన కేసుల్లో ప్రధానంగా నిలిచినవి జానీ మాస్టర్ కేసు మరియు రాజ్ తరుణ్ కేసులు. ఈ రెండు కేసులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఈ కొత్త ఏడాదిలోను మెల్లమెల్లగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ వివాదాలు మరోసారి అగ్ని రాచుకుంటూ తెరమీదకి రాబోతున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కేసు కొంతకాలం ఒక మూలన పడిన మళ్లీ మెల్లగా తెరపైకి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి ఇంటర్వ్యూలతో కౌంటర్ మరియు ఎన్కౌంటర్లు గట్టిగానే నడుస్తున్నాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనపై కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మపై కీలకమైన ఆరోపణలు చేయడంతో… దానికి కౌంటర్ గా శ్రేష్ఠ మళ్ళీ బయటకు వచ్చి ఓ మీడియాకు భారీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వివాదం అనేది మళ్లీ తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్ అలాగే అతని భార్యపై కూడా శ్రేష్ట భారీ ఆరోపణలు చేస్తుంది. శ్రేష్ట చేసిన కామెంట్లకు జానీ మాస్టర్ భార్య కూడా స్పందించింది.
ఇదిలా ఉండగా మరోపక్క రాజ్ తరుణ్ వివాదం కూడా మెల్లమెల్లగా అగ్ని రాచుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఈ వివాదం మర్చిపోయి నెలరోజులు అవుతున్న తర్వాత రాజ్ తరుణ్ భార్య లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఇక్కడ మస్తాన్ సాయి పై కంప్లీట్ ఇవ్వడం జరిగింది. చాలామంది నగ్న వీడియోలు మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయని చెప్తూ హార్డ్ డిస్క్ కూడా పోలీసు దగ్గరికి తీసుకు వెళ్ళింది. అలాగే మరోవైపు ఈ కేసులో ఒకప్పుడు బాగా నలిగిన పేరు శేఖర్ భాషను హత్య చేసే కుట్ర జరుగుతుందంటూ తాజాగా ఆ వీడియో బయటపడింది.
ఇక లావణ్య స్నేహితురాలు మరో వ్యక్తి తో మాట్లాడుతున్న ఫోన్ ఆడియో లీక్ అయితే విడుదలయింది. ఆ ఆడియో లీక్ లో ముక్కలు ముక్కలుగా నరికి శేఖర్ భాషను చంపాలంటూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది. ఈ రెండు వివాదాలు కంటే ముందే మంచు ఫ్యామిలీలో గొడవ తెరపైకి వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సంక్రాంతి పండుగ నుంచి మంచు ఫ్యామిలీలో వివాదాలనేవి చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వీరి కేసులు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నాయి. రీసెంట్ గానే కుక్క అంటూ ఒకరిపై ఒకరు పెట్టుకున్న ట్వీట్లు అనేవి మళ్లీ వివాదాలు అగ్ని రాచుకోవడానికి దోహదపడుతున్నాయి . ఇలా ఇప్పుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య కేసు మరోవైపు మంచు ఫ్యామిలీ గొడవలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి. వీళ్ళ మూడు ఫ్యామిలీల కేసులు అనేవి గత ఏడాది హైలెట్గా నిలవడం విశేషం. కొన్ని నెలలపాటుగా ఈ మూడు కేసులు మీడియాకు మంచి దమ్ బిర్యాని అందించడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ గొడవలు అనేవి ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు అని రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ముందు ముందు రాష్ట్రంలో ఇంకా ఎంతమంది సెలబ్రిటీల గొడవలు జరుగుతాయో అని ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా సరే వీళ్ళ కేసులు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు మంచి time pass ను అందిస్తున్నాయి. ఏ సోషల్ మీడియాలో చూసిన కూడా వీళ్ళ మూడు కుటుంబాల వివాదాలే కనబడుతున్నాయి. దీంతో సెలబ్రిటీలు ఈమధ్య ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. అది కూడా కుటుంబంలోనే గొడవలు రేకెత్తడంతో ప్రజలకు ఈ వివాదాలనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా నిలుస్తున్నాయి.