మామ మశ్చీంద్ర మూవీ రివ్యూ

Reviews

నటీనటులు.. సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాలిని రవి, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చీ కిరణ్
దర్శకుడు..హర్షవర్ధన్
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి
నిర్మాతలు.. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతం.. చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫి.. పీజీ విందా


కథ
డబ్బు కోసం ఒక కుటుంబాన్ని ఎలా మోసం చేశారు అన్న నేపథ్యంలో ఈసినిమా కథ ఉంటుంది. పరుశురామ్ (సుధీర్ బాబు ) చిన్నప్పటి నుండి దానాలు, మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడుతుండేవాడు. అయితే తన తండ్రే డబ్బుకోసం తన తల్లిని చంపేస్తాడని తెలుసుకున్న తర్వాత రాక్షసుడిలా మారిపోతాడు. ఇక పరుశురామ్ పెద్దయ్యాక తనకు ఒక కూతురు (ఈషారెబ్బా) పుడుతుంది. మరి ఈషారెబ్బా పుట్టిన తరువాత తన లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి.. దుర్గా, డీజే లకు పరుశురామ్ కు సంబంధం ఏంటి? వారి వల్ల పరుశురామ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ఈసినిమా మిగిలిన కథ..


విశ్లేషణ
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావ మరిదిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు మొదటినుండీ కూడా కాస్త డిఫరెంట్ కథలనే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే కాకుండా పాత్ర ప్రధానమైన సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇక అలాంటి ప్రయోగాల్లో వచ్చిన సినిమానే మామ మశ్చీంద్ర.
నిజానికి ఈసినిమాకు డైరెక్టర్ హర్షవర్థన్ అన్నప్పుడే సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టే డిఫరెంట్ కథతో వచ్చాడు హర్ష వర్షన్. తన రైటింగ్ స్కిల్స్ ను మరోసారి చూపించాడు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఊహించని ట్విస్ట్ లతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక డైరెక్షన్ తో పాటు తను ఈసినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించాడు.
ఇక నటీనటుల పెర్పామెన్స్ విషయానికి వస్తే ఈసినిమాలో సుధీర్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు అని చెప్పొచ్చు. దుర్గా, పరుశురామ్, డీజే అనే మూడు పాత్రల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ గెటప్పుల మేకోవర్ కోసం తను పడిన కష్టం కనిపిస్తుంది. అంతేకాదు మూడు పాత్రలకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజస్ ను సెట్ చేయడం వల్ల వేరియేషన్ ను క్లియర్ గా చూపించగలిగాడు.హీరోయిన్లు గా చేసిన ఈషా రెబ్బా అలానే మృణాళిని రవి ఇద్దరూ తమ సహజమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అలీ రెజాకు పాత్ర నిడివి తక్కువైనా ఇంపార్టెంట్ రోలే దక్కింది. హర్ష వర్ధన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో చూసేశాం. ఎలాంటి పాత్రలో అయినా సరే మెప్పించే టాలెంటెండ్ నటుల్లో తన పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈసినిమాలో కూడా ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించాడు. అజయ్ తో సహా ఇతర నటీనటులు తమ పాత్రల మేర నటించారు.


టెక్నికల్ విషయాలకొస్తే ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన పీజీ విందా మంచి విజువల్స్ ను అందించాడు. అలానే చైతన్య భరద్వాజ్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే మనిషి జీవితంలో డబ్బు అనేది ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఈరోజుల్లో బంధాలను పక్కనపెట్టి డబ్బుకు విలువ ఇస్తున్నారు ఎంతోమంది. ఈనేపథ్యంలో బంధాలు శాశ్వతం కానీ.. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదని చక్కని మెసేజ్ ను ఇచ్చాడు హర్షవర్థన్.