బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరియు హాలీవుడ్ నిక్ జోనస్ ఇద్దరు కూడా మంచి ప్రేమికులు. బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి మన అందరికీ తెలిసిందే. ఆమె బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే ప్రముఖ సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్ నిక్ జోనస్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే పెళ్లి తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేతి నిండా కూడా సినిమాలు. అందులో మూడు హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఆమె తన జీవితంలోకి విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను పంచుకుంటూ ఒక బుక్ కూడా రాసింది. ఎన్నో రకాలైనటువంటి డేటింగ్ వెబ్సైట్లు మరియు యాప్ల కాలంలో నిక్ జోనస్ ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా ప్రియాంక చోప్రా తో తన మొదటి సంభాషణను ప్రారంభించాడట. ఆ తర్వాత అతని స్నేహితులు మనమిద్దరం కలిసి జీవించాలని తెలపడంతో ఈ విషయాన్ని డైరెక్ట్ గా ప్రియాంక చోప్రా తో నిక్ జోనస్ తెలిపాడట. అప్పటినుండి ఇద్దరు కూడా నెంబర్లు మార్చుకొని ప్రేమలో పడిపోయారు. ఇక ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ మొట్టమొదటిసారిగా 2017 వానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీలో మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఇది ఎంత నాటిక ఏం గా అనిపించినా కూడా తన కాబోయే భార్యను మొదటిసారి చూసినప్పుడు చాలా ఆనంద పడిపోయాడు. ఇక వెంటనే నిక్ జోనస్ తన ప్రేమ విషయాన్ని మోకరిల్లి మరి ఐ లవ్ యు చెప్పాడట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మద్యం సేవించి కొంచెం సేపు పాటు కబుర్లు చెప్పుకున్నారట. కొద్దిరోజుల తర్వాత ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ నూతన అపార్ట్మెంట్కు ఆహ్వానించింది అంట. ఇక తన అపార్ట్మెంట్లోని రెండు గంటల పాటు మాట్లాడుకుని సమయాన్ని గడిపారు. ఇక నిక్ జోనస్ ఆ అపార్ట్మెంట్ నుండి వెళ్లిపోయేటప్పుడు అతని నుండి ఒక కిస్ ఎక్స్పెక్ట్ చేసిందట. ఇదే విషయాన్ని నీకు జోనస్తో ప్రియాంక చోప్రా చెప్పగా ఇక అప్పుడు జోనస్ తన హృదయంలో ప్రియాంక చోప్రాకు స్థానం ఇచ్చాడు. ఇంక చాలాసార్లు ప్రియాంక చోప్రాకి డైమండ్ గిఫ్ట్లు కూడా ఇచ్చాడు. ఇక రాజస్థాన్లోని విలాస్వంతమైన ఉమైత్ భవన్ ప్యాలెస్ లో నీకు జోనస్ తండ్రి పాశ్చర్య వేడుకను అధికారికంగా నిర్వహించడంతో వారి సంబంధం లో గొప్ప రోజుగా మిగిలి పోయిందట. ఇంకా తర్వాత ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ ఇద్దరు కూడా మతపరమైన కలయికతో కలిశారు. మాతపరమైన కలయికలో మా వివాహం జరగడం చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ ఇద్దరు 2022లో తమ కుమార్తె మాల్టీ మేరీ కి జన్మనిచ్చారు. ఇలా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు వరకు వీళ్ళ ప్రేమ వ్యవహారం నడిచిందట. వీళ్ళిద్దరి మధ్య ఎన్నో సార్లు మనస్పర్ధలు వచ్చినా కూడా ఇప్పటికీ బాగా కలిసి ఉన్నారు. మొదటగా సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వీళ్ళిద్దరూ మెల్లి మెల్లిగా కలుసుకొని ఈరోజు ఒకటిగా జీవితం సాగిస్తున్నారు.
