టాలీవుడ్ యంగ్ టైగర్ నటించిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన మొదట్లో సినిమా అంతగా బాగాలేదని చాలా రివ్యూస్ రాగా మళ్లీ మళ్లీగా ప్రతి ఒక్కరు థియేటర్కు వచ్చి చూడడం వల్ల కలెక్షన్లనేవి బాగానే వచ్చాయి. ఇక తాజాగా ఈ నేపథ్యంలోనే సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా తొందరగా దేవర 2 షూటింగ్ పూర్తి చేసుకుని త్వరగా ధియేటర్ కి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం దేవర పార్ట్ టూ స్క్రిప్ట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయట. స్క్రీన్ ప్లే మరియు కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీం తో గత కొన్ని వారాలుగా చాలా వర్క్ చేస్తున్నారట. అయితే ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ అనేది ప్రారంభం అవుతుందని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రానప్పటికీ, ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటించారు. మరి రెండవ భాగంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ ని ఆడ్ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది. కాగా విలన్ గా సైఫ్ అలీఖాన్ తన నటనతో అందరినీ మెప్పించారు. ఇక అనిరుద్ మ్యూజిక్ అయితే మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఈ మ్యూజిక్ వల్లే సినిమా అంతగా హిట్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కదా ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ లాంటి కీలక పాత్రల్లో ముఖ్య నటులు నటించారు. ఇక తాజాగా వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రశాంత్ నీళ్లతో చేసే సినిమాపై ఎన్టీఆర్ దృష్టి పెట్టారు అన్నట్లుగా తెలుస్తుంది.
