60 ఏళ్ల వయసులోనూ 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సౌత్ హీరోలు ఎవరో తెలుసా?…సౌత్ ఇండియన్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో 60 ఏళ్ల వయసు దాటిన కొంతమంది ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతున్నారు. దానికి కారణం వాళ్ళ ఎనర్జీ, ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సాధారణంగా బయట ఏ రంగంలో అయినా 60 ఏళ్ల వయసు వచ్చిందంటే కచ్చితంగా రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. కానీ సినిమాల్లో అలా కాదు… ఇంకా హీరోగా చేస్తూనే ఉన్నారు. కొన్ని వందల కోట్ల కలెక్షన్లు కూడా 60 ఏళ్ల వయసులోనూ సాధిస్తున్నారు. యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో దుమ్ములేపుతు చాలా సులువంగా 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు అవలీలగా సాధిస్తూ ఉన్నారు. ఇక రాబోతున్న సినిమాలు కూడా చాలా సంచలనాత్మకంగా మారబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీగా 2000 కోట్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ సీనియర్ హీరోల విషయంలో ఇది కష్టమనే చెప్పాలి. వారి సినిమా 100 కోట్లు లేదా 200 కోట్లు కలెక్ట్ చేయడం చాలా గొప్పగా మారిపోయింది. మరి 60 ఏళ్ల వయసులోనూ సౌత్ హీరోలు ఈజీగా 200 కోట్లు కలెక్షన్లు రాబెట్టిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
60 ఏళ్ల వయసులోనూ ఈ ఘనత సాధించిన మొట్టమొదటి హీరోగా రజనీకాంత్ నిలిచాడు. ఈయన రోబో 2.0 మూవీతో సులభంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాడు. ఇక అదే విధంగా జైలర్ సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు రజినీకాంత్. ఈ సినిమా కూడా దాదాపుగా 650 కోట్ల కలెక్షన్లను రాబెట్టింది. కాగా ప్రస్తుతం కూలి సినిమాతో 1000 కోట్లు టార్గెట్ చేశారు రజినీకాంత్.
ఇక ఆ తరువాత స్థానంలో కమలహాసన్ నిలిచారు. హీరో కమలహాసన్ కూడా విక్రమ్ అనే సినిమాతో 300 కోట్లను 60 ఏళ్ల వయసులో సాధించారు. కాగా ప్రస్తుతం తగ్ లైఫ్ మూవీ తో మరోసారి భారీ కలెక్షన్లపై కన్నేశారు కమలహాసన్. అయితే మరోవైపు ‘కల్కి 2898 ‘ అనే సినిమాతో సులభంగా 1000 కోట్లు సాధించి ఈ చిత్రంలో మంచి నటుడిగా భాగమయ్యారు.
ఇక సౌత్లో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఇటీవల సంక్రాంతికి ” సంక్రాంతికి వస్తున్నాము ” అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. తెలుగు సీనియర్ హీరోలు ఈ ఘనత సాధించిన ఏకైక హీరో వెంకీ కావడం చాలా విశేషం. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున లో కూడా ఈ ఘనతలు సాధించలేదు.