టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో అడ్వెంచర్ తరహాలో రానున్న సినిమాపై చాలా రూమర్లు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అలాగే మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమార్ అని కూడా ఇందులో నటిస్తున్నాడని చాలా రూమర్లు వస్తున్నాయి. ఇంకా ప్రియాంక చోప్రా తో పాటుగా మరో హాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఈ సినిమా 2027 లేదా 2028లో థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
అడ్వెంచర్ మూవీ కాబట్టి అడవుల్లో సాగే సాహస ప్రపంచ యాత్ర నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథను మూడు పార్ట్లుగా రాజమౌళి విభజిస్తాడు అనే కథనాలు సోషల్ మీడియాలో వైర ల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి భాగం పూర్తి కాగానే రెండవ భాగం షూట్ చేస్తారా అనేది కొత్త ప్రశ్నగా మారిపోయింది.
ప్రభాస్ తన ఐదేళ్ల కెరీర్ నీ రాజమౌళికి సమర్పించినట్లుగా ఇప్పుడు మహేష్ బాబు కూడా అలానే ఐదు సంవత్సరాలు రాజమౌళికి కేటాయిస్తాడా అనేది అందరిలోనూ ప్రశ్నగా మిగిలిపోయింది. కాదా ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రాజమౌళి విజన్ మాత్రం ఇలానే ఉంటుందని అందరికీ తెలుసు. దీంతో మహేష్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు జరగకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేస్తుందట. ఈ సినిమాని దుర్గ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాబట్టి చాలా రూమర్లే ఈ సినిమాపై పుట్టుకొస్తున్నాయి.
FIND BEST MATRIMONY SERVICE ASTROLOGY – VASTU – NADI ASTROLOGY – ONLINE ASTROLOGY