సత్యా రెడ్డి హీరోగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. మరి ముఖ్యంగా చెప్పాలంటే గద్దర్ ఆఖరి సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే గద్దర్ చనిపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా నవంబర్ 29న థియేటర్లలో విడుదల అయ్యి నేటితో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో కొన్ని కల్పిత అంశాలు జోడించి విప్లవాత్మకంగా తరకెక్కించారు. ఈ సినిమాలో గద్దర్, పల్సర్ బైక్ ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎం వివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్ అలాగే వెన్నెల లాంటి పలువురు సీనియర్ నటులు ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఏపీలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో పలువురు నాయకులు మరియు ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు ఉద్యమాలు చేస్తుంటారు. ఈ సమయంలో బాగా డబ్బున్న వ్యక్తి సత్య రెడ్డి ఉద్యమం కోసం వచ్చి ఉద్యమాన్ని మరింత బలోపితం చేస్తారు. ఈ ఉద్యమాన్ని ఆపడానికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తుంది. కానీ ఆమె కూడా ఈ ఉద్యమం గురించి సత్యారెడ్డి ద్వారా తెలుసుకొని వీళ్ళకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కొంతమంది నాయకులు ఆమెను కిడ్నాప్ చేసి ఆ ఉద్యమాన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తారు. ఇక చివరికి సత్యారెడ్డి ఆ పోలీస్ ఆఫీసర్ ని కాపాడాడా?.. ప్రైవేటీకరణ ఆగిపోయిందా? అసలు ఈ కథలోకి గద్దర్ ఎలా వచ్చారు అనేదే ఈ సినిమా. చాలా రియల్ గా జరిగినా కొన్ని సంఘటనలను కల్పిత సన్నివేశాలను జతి చేసి రూపొందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి బాగానే చూపించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే గద్దర్ చనిపోవడంతో సినిమాలో కూడా ఆయన మరణించినట్లుగా చూపించారు. ఉక్కు సత్యాగ్రహం నేటికీ వంద రోజులను పూర్తి చేసుకొని మరో రికార్డ్ ను సృష్టించింది. ఇప్పటికి చాలా మంది ఈ సినిమాను చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఏకంగా గూస్ బంప్స్ ను తెప్పిస్తాయి. మెయిన్ లీడ్ హీరోగా సత్యా రెడ్డి పోరాట యోధుడిగా బాగానే నటించారు. సినిమా డైలాగ్స్, మాటలు అలాగే సంగీతం కూడా అన్ని పర్వాలేదనిపించాయి. మిగతా నటీనటులు అందరు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిగా ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో వంద రోజులు పూర్తి కావడంతో శత దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే గద్దర్ చనిపోవడంతో గద్దర్ కి కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. మరోసారి 100 రోజులు కారణంగా ఈ సినిమా సక్సెస్ వేడుకలు చిత్ర బృందం జరుపుతుంది.
FIND BEST PROPERTIES – MATRIMONY SERVICE – ABROAD CONSULTANCY – ASTROLOGY – VASTU
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.